పల్నాడులో భారీ స్కాం బయటపడింది. ఇంటి దొంగల చేతి వాటంతో దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో భారీగా బంగారం మాయమైంది. డబ్బు చెల్లించిన తర్వాత బంగారం ఇవ్వమంటే ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. బ్యాంక్ అప్రైజర్ నాగార్జున, మేనేజర్ మధుబాబు కలిసి తమ బంగారం మాయం చేశారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
చిరంజీవి ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ కి, టికెట్ రేట్స్ పెంపుకు లింకు పెట్టడం దురదృష్టకరమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. బడ్జెట్ పై రుజువులు తెలుసుకున్న తర్వాత ధరలు పెంచడం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు చనిపోయింది. సీతానగరం మండలం గుచ్చిమివలస దగ్గర ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే లోపు భార్య కొత్తకోట అమూల్య(29) మృతి చెందింది.
కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు.
కాకినాడ బీచ్ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రేమజంట.. ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన అరుణ్, శ్రీదేవిగా గుర్తించారు.
రాచకొండ పరిధిలో చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో ఓ బాధితురాలు ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో డయల్ 100కు ఫోన్ చేయగా.. రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు సీపీ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం పొగలు వచ్చాయి. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న వందే భారత్ రైలులో పొగలు రావడంతో అధికారులు అరగంట పాటు నిలిపివేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రహమత్ నగర్ లో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీ ఇచ్చారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు.