అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి NTPCలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కేబుల్ ట్రాక్ విరిగిపడడంతో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Emergency Landing: హిమాచల్ సీఎంకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సుమారు 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. NTPCలో మెయింటెనెన్స్ పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుల అంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.