భోళాశంకర్ సినిమా టికెట్ రేట్ల పెంపు వివాదం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని మేకర్స్ కోరారు. అయితే సరైన డాక్యుమెంట్స్ ఇవ్వలేదనే కారణంతో ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సర్కారు నిర్ణయించిన సుమారు 11 పత్రాలను చిత్ర నిర్మాతలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికీ ఇవి తమకు అందలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి అనుమతి లేనట్లేనని తెలిపింది.
Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. ప్రాదేయపడినా కనికరించకుండా..
మరోవైపు ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ఈ నెల 2న టికెట్ రేట్లు పెంచమని దరఖాస్తు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం వివరణ డాక్యుమెంట్స్ అడిగింది, అవి ఇవ్వలేదని పేర్కొన్నారు. రూ.101 కోట్లతో సినిమా నిర్మాణం జరిగిందని చెప్పారని.. జీఎస్టీ, బ్యాంక్ స్టేట్మెంట్ లు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్, షూటింగ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ వివరాలు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. 12 అంశాలపై ప్రభుత్వం క్లారిటీ అడిగిందని.. చిత్ర యూనిట్ వివరణ ఇవ్వలేదని పేర్కొన్నారు.
MP Ranjith Reddy : తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు
చిరంజీవి ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ కి, టికెట్ రేట్స్ పెంపుకు లింకు పెట్టడం దురదృష్టకరమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. బడ్జెట్ పై రుజువులు తెలుసుకున్న తర్వాత ధరలు పెంచడం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. జగన్ పై ఎవరి ప్రేరణతో కామెంట్ చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకి రేట్లు పెంచామని.. సినిమాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. భోళా శంకర్ ను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం విరమించుకుంటే మంచిదని మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు.