Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..! అరగంట నిలిచిన రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం పొగలు వచ్చాయి. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న వందే భారత్ రైలులో పొగలు రావడంతో అధికారులు అరగంట పాటు నిలిపివేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే పొగలు వచ్చాయి. వాటిని గుర్తించిన రైల్వే సిబ్బంది మనుబోలు రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలును నిలిపివేశారు. అనంతరం అందులో ప్రయాణికులందర్నీ బోగీ నుండి కిందకు దింపారు. దీంతో ప్రాణపాయం తప్పింది.
Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
వందేభారత్ రైలులోని మూడో బోగీలో పొగలను గుర్తించారు. బాత్రూమ్ నుండి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి తనిఖీ చేపట్టారు. అయితే సిగరేట్ కాల్చిపడేసిన ముక్క కనపడింది. అది ప్లాస్టిక్ సామాగ్రికి వ్యాపించడంతో పొగ వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం రైలులో పొగలను పూర్తిగా ఆపివేసి, రైలును పంపించారు.
- Tags
- Cigarette
- smoke
- stop
- Train
- Vande Bharat
తాజావార్తలు
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!