రోడ్డు ప్రమాదం ఆ నవ వధువు నిండు జీవితాన్ని మింగేసింది. పెళ్లయి రెండు నెలలు కాకముందే కాటికి వెళ్లింది. పెళ్లి చేసుకుని భర్తతో జీవితాన్ని పంచుకోవాల్సిన ఆ మహిళ యమలోకానికి వెళ్లింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
Nirmala Sitharaman: అసెంబ్లీలో జయలలిత చీర లాగి ఎగతాళి చేశారు.. డీఎంకేపై కేంద్ర మంత్రి ఫైర్
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు చనిపోయింది. సీతానగరం మండలం గుచ్చిమివలస దగ్గర ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే లోపు భార్య కొత్తకోట అమూల్య(29) మృతి చెందింది. మరోవైపు భర్త దినేష్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బొబ్బిలికి చెందిన దినేష్ కుమార్ తో అమూల్యకు రెండు నెలలు క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.