ఇటీవలే గ్రీన్ టీని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇది తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి.
విశాఖలోని జగదాంబ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం జగన్ రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పనులు చేయిస్తున్నాడని విమర్శించారు. సింహద్రి సాక్షిగా చెప్తున్నాను.. వాలంటర్లు మీద ద్వేషము లేదన్నారు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వారిని గద్దెనెక్కించారని.. తెలంగాణ రావడానికి జగన్ కారణమని పవన్ పేర్కొన్నారు.
ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు నియామకం జరిగింది. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చే నామినేట్ చేయబడిన కర్రి పద్మ, డా.కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్.సంఖ్య.87 ను నేడు జారీ చేశారు.
ప్రజల వద్దకు పాల్ అని తిరుగుతున్నా అని కేఏ పాల్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ లు మాట్లాడుకుని విలీనం గురించి.. అల్లు అరవింద్ మధ్యవర్తిగా జనసేనను అమ్మకానికి పెట్టారంటూ పాల్ తెలిపారు.
జగదాంబ జంక్షన్ జనసంద్రంగా మారడంతో.. ఆ ప్రాంతమంతా జనసైనికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు సభా ప్రాంగణానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గాయి. గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై చర్చించారు. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ చర్చించారు.