కాకినాడ బీచ్ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రేమజంట.. ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన అరుణ్, శ్రీదేవిగా గుర్తించారు. మహిళను వివాహితగా చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Nirmala Sitharaman: రూ.70కే కిలో టమాటా.. సబ్సిడీ ధరతో విక్రయం
మరోవైపు రోజురోజుకు దేశ వ్యాప్తంగా ఆత్మహత్యాయత్నం, ఆత్మహత్య ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. వారిక ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే మానసిక నిపుణులను కలవాలని కోరుతున్నారు. జీవితం అనేది అందమైన ప్రపంచం.. జీవితం అనేది విలువైనది. అందులో గెలవాలి, పోరాడాలి అనే కుతుహలం ఉండాలి కానీ.. ఇలా చిన్నచిన్న వాటికి భయపడి ప్రాణాలు తీసుకునే పని చేయొద్దు. ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి.