రాచకొండ పరిధిలో చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో ఓ బాధితురాలు ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో డయల్ 100కు ఫోన్ చేయగా.. రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు సీపీ చెప్పారు. బుధవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు.
Plane Crash: బీరు తాగుతూ విమానం నడిపి.. అనంత లోకాలకు
‘‘వనస్థలిపురంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో చైన్ లాక్కొని వెళ్లారు. వెంటనే తేరుకున్న మహిళ.. ఐదు నిమిషాల్లో డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసిందని సీపీ తెలిపారు. నేరం జరిగిన రెండు గంటల్లోనే ఈ కేసు చేధించామని సీపీ పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్ పాల్పడిన ఇద్దరు నిందితులను శరత్ జోన్సన్, విజయ్ లను అరెస్ట్ చేసామన్నారు.
Aditi Rao Hydari: సిద్దార్థ్ గర్ల్ ఫ్రెండ్ ను చూశారా.. ఏ రేంజ్ లో చూపిస్తుందో..?
బాధిత మహిళ సమయస్ఫూర్తిని అభినందిస్తున్నట్లు సీపీ చౌహాన్ చెప్పుకొచ్చారు. ఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా డయల్ 100కు ఫోన్ చేస్తే అంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు వీలుంటుందని ఆయన అన్నారు. కొందరు ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే షాక్‌కు గురై సకాలంలో డయల్ 100కు ఫోన్ చేయడం లేదని.. ఈలోగా నిందితులు తప్పించుకుంటున్నారని తెలిపారు. ఇటీవల హయత్‌నగర్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో కూడా 8 గంటల్లో నిందితులను పట్టుకున్నామని.. ఏదైనా ఘటన జరిగితే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలి’’ అని రాచకొండ సీపీ విజ్ఞప్తి చేశారు.