హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఘటనలో తెలంగాణ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో తెలుగుతేజం తిలక్ వర్మ మళ్లీ మెరిశాడు. తొలి టీ20లోనే అత్యుత్తమ ప్రదర్శన చూపించిన తిలక్.. 39 పరుగులు చేశాడు. ఇక ఈరోజు జరిగిన రెండో టీ20లోనూ అర్థసెంచరీ సాధించాడు.
ఛలో విధ్యుత్ సౌద మరియు మహాధర్నా సందర్భంగా విజయవాడలోని హోటల్స్, లాడ్జ్ లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈనెల 8న చలో విద్యుత్ సౌధ పిలుపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్‌కు రానుంది.
రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి పేరుతో.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో సీపీఐ ఐస్సుయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో కనిపిస్తుంది.
ఓ కార్మికుడు రైల్వే వంతెనపై ఉన్న పట్టాలపై పనిచేస్తుండగా సడన్ గా రైలు రావడంతో.. అతను ప్రాణాలు రక్షించుకునేందుకు భారీ సాహసం చేశాడు. ముందు రైలు దూసుకొస్తుంది.. పక్కకు వెళ్దామంటే నది ప్రవహిస్తుంది. అతను చేసేదేమీ లేకుండా వెంటనే కిందనున్న నదిలోకి దూకాడు. ఈ ఘటన బీహార్ లోని సహర్సా జిల్లాలో జరిగింది.
ఇండియా మార్కెట్లో షావోమీ రికార్డును క్రియేట్ చేసింది. రిలీజైన మొదటి రోజే భారీ అమ్మకాలను నమోదు చేసింది. రెడ్ మీ బ్రాండ్ పై రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా.. మొదటి రోజే 3 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి.