హైదరాబాద్ మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త నిర్లక్ష్య కారణంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే! వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీ హిల్స్ నుండి ITC కోహినూర్ హోటల్ వైపు వస్తున్న బ్రీజా కారు (B.No: TS09FB4896)పల్టీ కొట్టింది. కారు డ్రైవర్ అతివేగం, […]
యువతిని వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను గవర్నర్ ఆదేశించారు.
జవహర్ నగర్ బాధిత మహిళ ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బాధిత మహిళకు అండగా ఉంటామని తెలిపారు. అంతేకాకుండా.. బాధిత మహిళకు మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు పట్ల బుధవారం సాయంత్రం ఆమే పత్రిక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మీ పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు.
చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎప్పుడూ మన మీద ప్రేమ ఉండదని ఆరోపించారు. కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్‌గా మాట్లాడారన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్బంగా.. విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
బీసీలకు బీజేపీ అండగా అంటుందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 1200 మంది బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పడిందని.. కేసీఆర్ కు బీసీలంటే ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు.