Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆదిత్య కాలేజీలో జరగబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటల విడుదల సందర్భంగా, దర్శకుడు హరీష్ శంకర్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
READ ALSO: Pankaj Chaudhary: యోగి అడ్డాలో బీజేపీకి కొత్త దళపతి..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్, ఆలయ దర్శనంపై తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు”సినిమా మొదలుపెట్టిన తొలి రోజుల్లో కూడా నేను పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాను.” “సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో, మళ్ళీ దర్శనానికి వచ్చాను.” “పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ప్రజలు ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించారో, అదేవిధంగా భారీ అంచనాలతో ఈ సినిమాను నిర్మించాము.” పవన్ కళ్యాణ్ విజయం స్ఫూర్తితో, తమ చిత్రం కూడా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ హరీష్ శంకర్ పాదగయ క్షేత్రం నుండి ఆదిత్య కాలేజీలో జరిగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం ఈ సినిమా నుండి సాంగ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.
READ ALSO: Lionel Messi Hyderabad Tour: కలకత్తా మెస్సీ టూర్‌లో గందరగోళంతో హైదరాబాద్ లో భద్రత పెంపు!