రెండేళ్ల పాటు కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఇంతలోనే కొత్త సమస్యలు కొన్ని చిత్రసీమను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఫిల్మ్ ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టులకు సంబంధించిన వేతనాలను సవరించాల్సి ఉండటంతో వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే వేతనాలను పెంచకపోతే, జూలై 1వ తేదీ నుంచి యూనియన్లు సమ్మె బాట పట్టినా ఆశ్చర్యం లేదని ఫెడరేషన్ పెద్దలు కొందరు చెబుతున్నారు. సమ్మె నోటీస్‌ను ఫెడరేషన్ ఇటు ఫిల్మ్ […]
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం (జూన్ 13న) పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులకు వీడ్కోలు పలికి, బోధనకు తెరతీశాయి. ఈ విద్యా సంవత్సరం పిల్లలకే కాదు, పంతుళ్ళకు కూడా పరీక్షనే! ఎందుకంటే ఈ యేడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశారు. ఇది భాషాభిమానులకు బాధ కలిగిస్తున్న విషయమే! అయితే ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న సమయంలో పరభాషల మీద ద్వేషం మాని, పలు భాషలు నేర్చే దిశగా మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. […]
తెలుగు సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా సినిమాగా వర్ధిల్లుతోంది. దీంతో వరల్ట్ కంట్రీస్ దృష్టి మన చిత్రపరిశ్రమపై పడింది. టర్కీలో విదేశీ చలన చిత్ర నిర్మాతలకు చిత్రీకరణ జరుపుకునే అవకాశాలతో పాటు ఆర్ధికపరమైన రాయితీలు కల్పించటానికి ఆ దేశ కాన్సులేట్ జనరల్ అందరితో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన టర్కీ కాన్సులేట్ జనరల్ ఆర్హాన్ యల్ మాన్ ఓకన్ తో మా మాజీ ప్రెసిడెంట్, విజయకృష్ణా గ్రీన్ స్టూడియో అధినేత నరేశ్ తో […]
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు తెలుసు. ఆయన తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు సినిమా రంగంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని తాజాగా అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన ఇటీవలి సినిమా ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ […]
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాల అనంతరం సోలోగా వచ్చేందుకు సిద్దమైంది. ముందుగా జులై 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ […]
విష్ణు మంచు తాజా చిత్రం టైటిల్ వచ్చేసింది. ఈ టైటిల్ ప్రకటించేందుకు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. దీని కోసం రచయిత కోన వెంకట్, కెమెరామేన్ ఛోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో భేటీ వేశాడు విష్ణు. ఈ భేటీలోనే టైటిల్ ఏమిటని కోనను విష్ణు అడగ్గా, ‘జిన్నా’ అని చెబుతాడు కోనవెంకట్. అయితే ఇది ‘గాలి నాగేశ్వరరావు’కు సంక్షిప్త రూపమంటూ దానికి తగ్గట్టుగా టైటిల్ అనేశాడు కోన. ‘జిన్నా’ అనగానే పాకిస్తాన్ […]
పూరి తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయిక. దళం, జార్జ్ రెడ్డి సినిమాల దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమా తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్సికుతున్నిన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. తీరిక లేని షెడ్యూల్స్ లో తమ సినిమా ట్రైలర్ విడుదల […]
ఉదయ్ కిరణ్, నితిన్ లను స్టార్ హీరోలను చేసిన క్రెడిట్ దర్శకుడు తేజాకే దక్కుతుంది. అంతేకాదు… ఫిల్మ్ మేకింగ్ ను పేషన్ గా భావించే తేజ ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ మూవీస్ ను అందించారు. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు సైతం తన రెండో కొడుకు అభిరామ్ ను పరిచయం చేసే బాధ్యత తేజాకు అప్పగించారు. ఇదిలా ఉంటే… తాజాగా తేజ తనయుడు హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ ఈ నెల 10వ తేదీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 8వ తేదీ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్లాన్ చేసి, భారీ స్థాయిలో దానిని నిర్వహించాలని నిర్మాతలు భావించారు. దానికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడానికి […]
నాగచైతన్యతో విడిపోయాక సమంత ఫుల్ బిజీ అయింది. ఓ వైపు సినిమాలు మరో వైపు ఎండార్స్ మెంట్స్. ఇక సినిమాలలో నటించటానికి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తున్న సమంత బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా కోట్లు రాబట్టుకుంటోంది. ఇటీవల తన సోషల్ మీడియాలో సమంత బికినీ తో దిగిన చిత్తరువును పోస్ట్ చేసింది. ఆ బికినీ బర్బెర్రీ బ్రాండ్ ది. నిజానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత ఒక్కో పోస్ట్ […]