ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఆరంభించారు. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, నాని, దుల్కర్ సల్మాన్ సందడి చేశారు.
ఇక ప్రశాంత్ నీల్‌తో కలిసి తెలుగు, కన్నడ భాషాల్లో ‘సాలార్’ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. శృతి హాసన్ ఇందులో కథానాయిక. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘దేవదాస్’ సినిమాల్లో నటించాడు నాని. ఇక దుల్కర్ ‘మహానటి’తో పాటు తాజాగా ‘సీతా రామం’లో నటిస్తున్నాడు.