అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఏనుగు’. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దీనిని రూపొందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్మించారు. జూలై 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ‘ఏనుగు’ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించిందని నిర్మాత తెలిపారు.
దర్శకుడు హరి గురించి నిర్మాత మాట్లాడుతూ, ”ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలను ఎంటర్టైన్మెంట్ రూపంలో ప్రేక్షకులకు తెలియచేయాలని అనుకున్నాం. దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ఇప్పుడు వస్తున్న ‘ఏనుగు’ చిత్రం కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ తో వచ్చి చూసే విధంగా ఉన్న ఉంటుంది. ఓ చక్కని అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు” అని అన్నారు. దర్శకుడిగా తనకిది 16వ సినిమా అని, ఇందులో ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ను చూపించానని హరి చెప్పారు.