తెలుగు చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న యన్టీఆర్, ఆ పై దర్శకుడు బి.విఠలాచార్య. కానీ, జానపద గీతం అనగానే వెనకాముందూ చూసుకోకుండా చప్పున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్య చౌదరిదే! ‘జానపద కవిరాజు’గా, ‘కవిరత్న’గా కొసరాజు జేజేలు అందుకున్నారు. కొసరాజు రాఘవయ్య చౌదరి 1905లో జన్మించారు. ఆయన పుట్టినతేదీపై సందిగ్ధం ఉంది. కొందరు జూన్ 23 అని అంటారు, సెప్టెంబర్ 3 అని మరికొందరు చెబుతారు. ఏది ఏమైనా 1905లోనే కొసరాజు […]
కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ సాధారణ స్థితికి చేరుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో చకాచకా ముందుకు సాగిపోతోంది. మన సినిమాకు ఇప్పుడు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఒక్కసారిగా కార్మికుల సమ్మెతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరి తెలుగు సినిమా ఎదుగదలలో తాము ఉన్నామని చాటిన సినీ కార్మికులు వేతనాల పెంపు కారణంతో సమ్మె చేయటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం… తెలుగు చిత్రపరిశ్రమకు సుప్రీం బాడీ ఫిలిమ్ […]
అమ్రిష్ పురి… ఈ పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మది పులకించి పోతుంది. ఆయన ఏ భాషలో నటించినా, అక్కడివారిని తన అభినయంతో ఆకట్టుకొనేవారు. అదీ అమ్రిష్ పురి ప్రత్యేకత! తెలుగులోనూ అమ్రిష్ పురి తనదైన బాణీ పలికించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? అమ్రిష్ పురి 1932 జూన్ 22న పంజాబ్ లో జన్మించారు. చిన్నతనం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ ఉండేవారు. తన అన్నలు చమన్ పురి, మదన్ పురి […]
పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు షాజీ కైలాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోంది మలయాళ చిత్రం ‘కడువా’. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ ను పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయాలని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ భావిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. అలానే ‘భీమ్లా […]
కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ బాలయ్య సినిమాలో రాజశేఖర్ పాత్రేంటి..! చివరగా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య.. అదే టైంలో ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో దుమ్ముదులిపారు. […]
కొత్త నటీనటులతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడం ఈ మధ్య కాస్తంత ఎక్కువైంది. అలానే ఓ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు సురేశ్ కుమార్ కుసిరెడ్డి. ‘ఏమైపోతానే’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రేమకథ చిత్రంలో అమర్ లు, చాందిని పౌర్ణమి జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు పోషించారు. అన్ని […]
‘నాన్న కరుణతోనే కన్ను తెరిచాం… మనం…’ అనేది అందరికీ తెలిసిన సత్యమే! తమ జన్మకు కారకులైన కన్నవారిని దేవతలుగా భావించేవారందరూ ధన్యజీవులే! చిత్రసీమలోనూ తమ తల్లిదండ్రులను ఆరాధిస్తూ సాగే తారలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా జనానికి గుర్తుకు వచ్చేవారు నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన ఇప్పుడే కాదు, ఏ సందర్భంలోనైనా తమ తండ్రి మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావును తలచుకుంటూనే ఉంటారు. అది కొందరికి చిత్రంగా అనిపించవచ్చు. కానీ, మనకు జన్మనిచ్చిన […]
కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘మన్మథలీల’ 1976లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ మూవీ డబ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. విశేషం ఏమంటే ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ చిత్రం తెరకెక్కించాడు. ‘మన్మథ లీల’ అనే ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీలో అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, సంయుక్త హెగ్డే, రియా సుమన్, చంద్రన్, జయప్రకాశ్, […]
ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం! టాలెంట్ ఉన్న వారు సైతం ఒక చోట సక్సెస్ సాధిస్తే, చిత్రంగా మరోచోట ఫెయిల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇది బాగా కనిపిస్తుంది. రంగస్థలం మీద గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమా రంగంలోనూ తమ అదృష్టం పరీక్షించుకుని చేదు అనుభవం ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ‘బుల్లితెర మీద దుమ్ము దులుపుతున్నాం కదా… వెండి తెర మీద […]
అలనాటి నాయిక మాధవి నటించిన ‘మాతృదేవో భవ’ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆ మూవీతో కనెక్ట్ అయ్యారు, ధియేటర్ లో కన్నీరు పెట్టారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘మాతృదేవోభవ’ అనే టైటిల్ తోనే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఇందులో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ ప్లే చేశారు. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త […]