అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘థ్యాంక్యూ’. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను జూలై 8న విడుదల చేయాలని తొలుత మేకర్స్ భావించారు. దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ మొదలెట్టారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో కాస్తంత జాప్యం జరగడంతో విడుదలను మరో రెండు వారాల వెనక్కి పంపారు.
సో.. ‘థ్యాంక్యూ’ మూవీ ముందు అనుకున్నట్టు జూలై 8న కాకుండా జూలై 22న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు బీవీయస్ రవి కథను, తమన్ సంగీతాన్ని అందించారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం.