వయోధిక పాత్రికేయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి.ఎస్. వరదాచారి అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు పాత్రికేయ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన గురువారం మధ్యాహ్నం తనువు చాలించారు.
ఇటీవల రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'కృష్ణ వ్రింద విహారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని ఎస్. ఎస్. అరుణాచలం డైరెక్ట్ చేయబోతున్నారు.
సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'దోస్తాన్'. ఎ. సూర్య నారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది.
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం 'తడ్కా'. నానా పటేకర్, శ్రియాశరన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
యంగ్ హీరో నాగశౌర్య, షెర్లీ సేతియా జంటగా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారంలో రోజులుగా జాతీయస్థాయిలో ఈ మూవీ అగ్రస్థానంలో ఉండటం విశేషం.
ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్స్ 'భేడియా' తెలుగు వర్షన్ 'తోడేలు'ను పంపిణీ చేయబోతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.
ప్రస్తుతం అనారోగ్యంతో పోరాడుతున్న సమంత, తన తాజా చిత్రం 'యశోద' కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించింది. వీటిని ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రూపొందించారు.
నవంబర్ 4న సంతోష్ శోభన్ నటించిన 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జనంలోకి వెళ్ళి డిఫరెంట్ గా మూవీ గురించి ఆరా తీస్తున్నాడు హీరో సంతోష్ శోభన్.
నటుడు ఆదిత్య ఓం మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఇప్పటికే భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న ఆయన గిరిజన గ్రామాలలో అంబులెన్స్ సర్వీస్ కు శ్రీకారం చుట్టారు.