ఇది అమర గాయకుడు ఘంటసాల శతజయంతి సంవత్సరం. ఆ మధ్య 'ఘంటసాల ది గ్రేట్' పేరుతో బయోపిక్ ను నిర్మించారు. కానీ ఇంతవరకూ అది విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు కనీసం ఓటీటీలో అయినా దానిని విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విశ్వ కార్తికేయ ఇప్పుడు మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో 'అల్లంత దూరాన' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది!
నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'మయూఖి'. ఈ మూవీ పోస్టర్ ను సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత 'డార్లింగ్' స్వామి పాల్గొన్నారు.
నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. దీనికి 'హరోం హర' అనే పేరు ఖరారు చేశారు.
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశీ జంటగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు నిర్మాత బన్నీ వాసు.
ఆనంద్ రవి, హరీశ్ ఉత్తమన్, శత్రు కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా 'కొరమీను'. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఆవిష్కరించారు. ఈ మూవీని శ్రీపతి కర్రి డైరెక్ట్ చేస్తున్నారు.
అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'హరికథ'. ఈ సినిమాలోని 'పిల్లా నీ చేతి గాజులు....' అనే గీతాన్ని ప్రముఖ నటుడు ప్రియదర్శి ఆవిష్కరించారు.