HONOR Magic8 Pro: HONOR సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ HONOR Magic8 Pro ను అధికారికంగా లాంచ్ చేసింది. అక్టోబర్‌లో మొదటగా పరిచయం చేసిన ఈ మోడల్‌ను దుబాయ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ప్రాంతీయంగా లాంచ్ చేశారు. HONOR Magic8 Pro UAEలో విడుదలైన తొలి స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) చిప్‌సెట్ ఫోన్. గత తరాల కంటే మెరుగైన ప్రాసెసింగ్ సామర్థ్యం, వేడి నియంత్రణను ఈ చిప్ అందిస్తుందని సంస్థ పేర్కొంది.
ఈ ఫోన్‌లో 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. UAEలో లభ్యమయ్యే తొలి 5.5G రెడీ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. Etisalat by e& సహా ప్రాంతీయ టెలికాం సంస్థల భాగస్వామ్యంతో హానర్ ఈ కనెక్టివిటీని అందిస్తోంది. AI ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్ కూడా ఈ ఫోన్‌లో భాగం. ఇందులోని AI బటన్, AI సెర్చ్, AI డాక్యూమెంట్స్ వంటి ఫీచర్లు రోజువారీ పనులను వేగవంతం చేస్తాయి. ఇమేజింగ్ ఈ ఫ్లాగ్‌షిప్‌లో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
సరికొత్త ఎలక్ట్రిక్ వైలెట్ రంగులో రాబోతున్న OnePlus 15R Ace Edition.. ఫీచర్స్ ఇవే..!
200MP AI అల్ట్రా నైట్ టెలిఫోటో కెమెరా ఎక్కువ సేపు, తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మంచి చిత్రాలను అందించేందుకు రూపొందించబడింది. అప్‌గ్రేడెడ్ AI అల్ట్రా నైట్ పోర్ట్రైట్ మోడ్ ఎక్స్‌పోజర్, కలర్ యాక్యురసీని మెరుగుపరుస్తుంది. AI మ్యాజిక్ కలర్, AI ఎడిటర్ ఫీచర్లు ఫోటోలను డివైస్‌లోనే ప్రొఫెషనల్ స్థాయిలో ఎడిట్ చేయడానికి సహాయపడతాయి.
HONOR Magic8 Pro స్పెసిఫికేషన్లు:
• 6.71-అంగుళాల 1.5K LTPO OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, HDR10+, గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్ 1800 nits, HDR పీక్ 6000 nits
• Snapdragon 8 Elite Gen 5 3nm ప్లాట్‌ఫారమ్, Adreno 840 GPU
• 12GB/16GB LPDDR5X RAM + 512GB/1TB UFS 4.0 స్టోరేజ్
• Magic UI 10.0 (Android 16 ఆధారితం)
• రియర్ కెమెరాలు: 50MP వైడ్ + 50MP అల్ట్రా వైడ్ (2.5cm మాక్రో), 200MP టెలిఫోటో (3.7X ఆప్టికల్ జూమ్, 100X డిజిటల్ జూమ్, OIS), 4K 60fps వీడియో
• ఫ్రంట్ కెమెరా: 50MP + 3D డెప్త్, 4K 60fps
• IP68 + IP69 + IP69K రేటింగ్స్
• అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్, IR సెన్సార్
• 7100mAh బ్యాటరీ, 100W వైర్డ్ SuperCharge, 80W వైర్లెస్ చార్జింగ్
• 5G, Wi-Fi 7, Bluetooth 6.0, NavIC, NFC, USB 3.2 Gen1 Type-C
• డ్యుయల్ స్టీరియో స్పీకర్లు (DTS:X Ultra)
శర్వానంద్ గ్యారేజీలోకి Lexus LM 350H లగ్జరీ కారు.. ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
UAEలో HONOR Magic8 Pro ప్రీ–ఆర్డర్లు నేటి (డిసెంబర్ 11) నుండి ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్ అనే మూడు రంగుల్లో లభ్యం అవుతాయి. 12GB + 512GB వేరియంట్ ధర AED 3,999 (రూ. 97,840), 16GB + 1TB ధర AED 4,699 (రూ. 1,14,965)గా ఉన్నాయి. ఇక ఈ మొబైల్ ను ప్రీ ఆర్డర్ లో బుక్ చేస్తే AED 2,299 విలువైన బహుమతులు అందుకోవచ్చు. ఇందులో HONOR Watch5 అల్ట్రా, 12 నెలల డ్యామేజ్ ప్రొటెక్షన్‌తో HONOR VIP Care+, 3 నెలల Google AI Pro ట్రయల్ అందుతాయి. ఈ ఫోన్ HONOR ఆన్లైన్ స్టోర్ తో పాటు Sharaf DG, Jumbo, అమెజాన్, నూన్, లూలూ వంటి ప్రధాన రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది.
🌃 Ultimate Night Zoom Battle: HONOR Magic8 Pro vs. iPhone 17 Pro Max!
You can literally see the tiny details the eye would normally miss.
But don’t just take our word for it… watch and see for yourself. Which one looks clearer to you? pic.twitter.com/VTlENyDVHC— HONOR (@Honorglobal) December 11, 2025