OnePlus 15R Ace Edition: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ నుండి త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 15R (OnePlus 15R) స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన వేరియంట్‌ను అధికారికంగా తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌కు వన్‌ప్లస్ 15R ఏస్ ఎడిషన్ (OnePlus 15R Ace Edition) అని పేరు పెట్టి.. “ఎలక్ట్రిక్ వైలెట్” అనే సరికొత్త రంగులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ప్రకటించిన చార్‌కోల్ బ్లాక్ (Charcoal Black), మింట్ గ్రీన్ (Mint Green) రంగుల జాబితాలో ఈ ‘ఎలక్ట్రిక్ వైలెట్’ మూడవ ఎంపికగా ఉండనుంది.
Pakistan: కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్.. మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష..
ఈ ఏస్ ఎడిషన్ ప్రత్యేకంగా ఫైబర్‌గ్లాస్ బ్యాక్ కవర్‌ను ఉపయోగించి రూపొందించబడింది. ఈ ప్యానెల్‌పై ప్రత్యేకమైన పూత సహాయంతో ‘Ace’ అనే పదం స్పష్టంగా ముద్రించబడి ఉంటుంది. ఇది మొబైల్ వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. కంపెనీ ఇప్పటికే కొన్నిటిని ధృవీకరించింది. ఈ సిరీస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Qualcomm Snapdragon 8 Gen 5) చిప్‌సెట్‌తో పనిచేయనుంది. ఈ ప్రాసెసర్‌ను హ్యాండ్‌సెట్ కోసం ప్రత్యేకంగా చేసినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాక ఈ చిప్‌సెట్ ప్రపంచవ్యాప్తంగా ఒక పరికరంలో అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
శర్వానంద్ గ్యారేజీలోకి Lexus LM 350H లగ్జరీ కారు.. ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 7,400 mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇమేజింగ్ టెక్నాలజీ కోసం వన్‌ప్లస్ 15లో పరిచయం చేసిన డీటైల్‌మ్యాక్స్ ఇంజిన్ (DetailMax Engine) ఫీచర్ ఇందులో కూడా ఉండనుంది. వన్‌ప్లస్ 15ఆర్ ఏస్ ఎడిషన్ అమెజాన్, అధికారిక వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు డిసెంబర్ 17న బెంగళూరులో జరగబోయే లాంచ్ కార్యక్రమంలో వెల్లడి కానున్నాయి.