Yashoda: సమంత బెస్ట్ ఇచ్చారంటున్న యానిక్ బెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashoda: సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన మూవీ ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ దీన్ని నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ… అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. మంగళవారం యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు. ”నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. యాక్షన్ డైరెక్టర్స్ కోరుకునేది అదే కదా! అందుకని, ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. ‘యశోద’లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో… ‘యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్… ‘యశోద’ యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి” అని అన్నారు.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ‘ఇన్సెప్షన్’, ‘డంకర్క్’కు కూడా ఆయన వర్క్ చేశారు. ‘ట్రాన్స్ పోర్టర్ 3’, ‘ప్రాజెక్ట్ 7’, ‘ప్యారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్’, ‘సిటీ హంటర్’ చిత్రాలతో పాటు హిందీలో షారుఖ్ ఖాన్ ‘రయీస్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, తెలుగులో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ చిత్రాలకు కూడా యానిక్ బెన్ పని చేశారు. సమంత అనారోగ్యానికి గురై, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న నేపథ్యం వచ్చిన ఈ యాక్షన్ వీడియో ఆమెలోని డెడికేషన్ ను తెలియచేసే విధంగా ఉండటం పలువురిని ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!