Akhanda 2: బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉండగా.. ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న విడుదల అవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ సినిమాకు స్ట్రీమింగ్ పార్టనర్ గా నెట్ ఫ్లిక్స్ వ్యవహరించనుంది. ఇక సినిమా ప్రీమియర్ షోల నేపథ్యంలో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొని ఉంది.
Ind vs SA 2nd T20I: క్వింటన్ డికాక్ విధ్వంసం.. టీమిండియాకు భారీ టార్గెట్..!
వాయిదా తర్వాత రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. ప్రీమియర్ షోల నిర్వహణకు ముందు ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణ హైకోర్టులో ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, నేడు ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. ఇందులో భాగంగా.. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC), సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసి విచారణను రేపటికి వాయిదా వేసింది. దీనితో ప్రజల్లో ప్రభుత్వ జీవో సస్పెండ్, తెలంగాణలో ‘అఖండ 2’ ప్రీమియర్ షోల నిర్వహణ, టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం నెలకొంది. కానీ మొత్తానికి ప్రీమియర్ షోలు మొదలవ్వడంతో ఆ గందరగోళానికి చెక్ పడినట్లయింది.