సాయి రోనక్ హీరోగా రామ్ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్ రావ్ నిర్మించిన సినిమా 'రాజయోగం'. అరుణ్ మురళీధరన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు ఎం.ఎం. శ్రీలేఖ ట్యూన్ ఇవ్వడం విశేషం.
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన 'తోడేలు' చిత్రం నుండి మరో పాట విడుదలైంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్ ను అల్లు అరవింద్ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ పోషించిన 'బుట్టబొమ్మ' సినిమా టీజర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సోమవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6లో షో నుండి తాజాగా ఎలిమినేట్ అయిన గీతూ రాయల్ వ్యవహార శైలిపై పలువురు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె అరవ ఓవర్ యాక్షన్ ను తట్టుకోవడం కష్టమంటూ కామెంట్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆమె 'లాల్ సలామ్' అనే సినిమాను రూపొందిస్తోంది. ఇందులో రజనీకాంత్ ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు.
'నెపోలియన్, ప్రతినిధి' చిత్రాలకు రచన చేసిన ఆనంద్ రవి ప్రధాన పాత్రను పోషించిన సినిమా 'కొరమీను'. శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్ళకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు.
శంకర్, శ్రీకాంత్ అడ్డాల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎం. ముత్తు తెరకెక్కిస్తున్న సినిమా 'చీక్లెట్స్'. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు.
యాభై శాతం సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరిపితే దాదాపు రెండు కోట్ల రాయితీని అందిస్తామని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలియచేస్తోంది. టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి ఇటీవల తెలుగు నిర్మాతలను కలిసి ఈ విషయం తెలిపారు.