Local Body Elections: తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయి.. 3,834 గ్రామపంచాయతీల్లో 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 56, 19,430 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. కాగా.. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవుల కోసం 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు సగటున 3.38 మంది, వార్డు స్థానాలకు సగటున 2.36 మంది పోటీ పడుతున్నారు. కాగా.. మధ్యాహ్నం 2 గంటల తరువాత లెక్కింపు ప్రారంభం అవుతుంది. అనంతరం ఫలితాలు సాయంత్రం ప్రకటిస్తారు. ఉపసర్పంచ్ను సైత నేడే ఎన్నుకుంటారు. గ్రామాల్లో జరిగే ప్రతి అంశంపై ఎన్టీవీ లైప్అప్డెట్స్ మీ కోసం..
తెలంగాణలో మొదలైన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. చలి తీవ్రతతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక ఆలస్యం.. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం.. 503 సర్పంచ్ స్థానాలు, 3796 వార్డు స్థానాలకు జరుగుతున్న పోలింగ్.. సర్పంచ్ పోటీలో 1784 మంది, వార్డు స్థానాల బరిలో 9250 మంది అభ్యర్థులు
ఉమ్మడి మెదక్ జిల్లా: ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 గ్రామాలు కాగా 39 గ్రామాలు ఏకగ్రీవం.. 420 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు..