Aha: స్టార్ ప్రెజెంటర్ ఓంకార్ నేతృత్వంలో సాగుతున్న ‘డాన్స్ ఐకాన్’ షో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాతలు అందులోని టీమ్స్ ను స్పాన్సర్ చేయడం అనే యూనిక్ పాయింట్ తో వ్యూవర్స్ అందరి దృష్టినీ ఈ డాన్స్ షో తన వైపు తిప్పుకుంది. పన్నెండు టీమ్స్ తో మొదలైన ఈ సీజన్ లో ఇప్పుడు టైటిల్ కోసం ఎనిమిది బృందాలు పోటీ పడుతున్నాయి. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు డాన్స్ ఐకాన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ ప్రసారమయ్యే 15 అండ్ 16 ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ వారం ఈ షోకు అందాల చిన్నది రాశీఖన్నా స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఆమెను షో ప్రొడ్యూసర్ కమ్ ప్రెజెంటర్ ఓంకార్ ఆహ్వానిస్తూ, ‘పెద్ద రోజుకు రోజా బొకే ఇచ్చినట్టుందం’టూ కితాబిచ్చాడు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన కొరియోగ్రాఫర్ యశ్… రాశీఖన్నాతో కలిసి స్టెప్పులేశాడు. శేఖర్ మాస్టర్, రమ్యకృష్ణ ప్రధాన న్యాయనిర్ణేతలు కాగా నటి మోనాల్ గజ్జర్, డాన్స్ మాస్టర్ యశ్, స్టార్ యాంకర్ శ్రీముఖి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వారం ‘జడ్జిస్ ఛాలెంజ్’ను థీమ్ గా నిర్ణయించారు. దాంతో కేవలం కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు వాళ్ళ మెంటర్స్ ఇచ్చిన థీమ్స్ గురించి కూడా చర్చించారు. మొత్తానికి సౌతిండియాలోనే బెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా ‘డాన్స్ ఐకాన్’ గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.