గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బి అండ్ డబ్ల్యు'! తాజాగా ఈ మూవీ టీజర్ను లెజెండరీ రైటర్, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు.
సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని 'హలో మీరా' అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు.
సినిమా రంగం ఎంత వాణిజ్యపరమైనది అయినా... ఆపన్నులను ఆదుకునే మంచి మనస్కులు సైతం ఆ రంగంలో ఉన్నారు. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను అదే ఉదారతను చాటుకున్నారు.
లోకనాయకుడు అని అభిమానులు గౌరవంగా పిలుచుకునే కమల్ హాసన్ 'విక్రమ్' మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లయిమాక్స్ లో మెరుపులా మెరిసి, మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాడు.
ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నవంబర్ లో కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఆహాలో మొదలు కానుంది. ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'గోల్కొండ హైస్కూల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్, 'తను నేను' చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
Veera Simha Reddy:సింహా టైటిల్ అచ్చి వచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రముఖుడు. తాజాగా ఆయనతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాకు 'వీరసింహారెడ్డి' అనే పేరు పెట్టడంతో నందమూరి అభిమానుల ఆనందాన్ని అవధులు లేకుండా ఉంది.
Urvashi Rautela: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా తెలుగులో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే.. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న 'బ్లాక్ రోజ్' అనే మూవీలో హీరోయిన్ గా చేసింది.
Ram Gopal Varma: రాయలసీమ పగ, ప్రతీకారాల నేపథ్యంలో ‘రక్త చరిత్ర’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్లో రెండు సినిమాలు తీయబోతున్నారు. అయితే.. కొనసాగింపుగా ఉండే ఈ సినిమాలకు రెండు పేర్లను పెట్టారు వర్మ. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వర్మ కలిసుకున్నారని, ఆ తర్వాత జగన్ బయోగ్రఫీని వర్మ తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ఖండిస్తూ, తాను తీయబోతోంది బయోపిక్ కాదని, దాన్ని […]
లయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కు ఇప్పుడు టైమ్ బాగుంది. 'భీమ్లానాయక్' మూవీతో ఏ ముహూర్తాన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ... చక్కని విజయాన్ని అందుకోవడంతో పాటు... 'బింబిసార'లోనూ ఛాన్స్ పొందింది. నిజం చెప్పాలంటే... సంయుక్త మీనన్ ముందుగా సైన్ చేసిన సినిమా ఇదేనట.