'అల్లరి' నరేశ్ తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' విడుదల రెండు వారాలు వాయిదా పడింది. ఈ నెల 11న కాకుండా ఈ మూవీని 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత రాజేశ్ దండా తెలిపారు.
సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉన్ని ముకుందన్ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు!
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా' ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది.
వరలక్ష్మీ శరత్ కుమార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'శబరి' చిత్రం మూడో షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెలలో హైదరాబాద్ లో మొదలయ్యే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
'పుష్ప' చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న సుకుమార్ ను 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శక నిర్మాతలు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. దీనితో ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే ప్రచారం ఊపందుకుంది!
ప్రముఖ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'నేనెవరు'. సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ మూవీకి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించారు.
గార్గేయి యల్లాప్రగడ నాయికగా కాకర్ల శ్రీనివాసు తెరకెక్కించిన సింగిల్ క్యారెక్టర్ మూవీ 'హలో మీరా'! ఇటీవల ఈ మూవీ టీజర్ ను హరీశ్ శంకర్ ఆవిష్కరించగా, తాజాగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రిలీజ్ చేశారు.
ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్న అప్సర రాణి అవకాశం ఇవ్వాలే కానీ హీరోయిన్ గానూ నటిస్తోంది. తాజాగా ఆమె నగేశ్ నారదాశి తెరకెక్కిస్తున్న 'తలకోన'లో కథానాయికగా నటిస్తోంది.
సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' శుక్రవారం విడుదల కాబోతోంది. సంతోష్ నటించిన 'ఏక్ మినీ కథ'కు స్టోరీ అందించిన మేర్లపాక మురళీ ఈ సినిమాకు దర్శకుడు.
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'మట్టి కుస్తీ' చిత్రం సెకండ్ లుక్ ను హీరోయిన్ కాజల్ విడుదల చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.