Naga Sourya: యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ సెప్టెంబర్ 23వ తేది విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో షెర్లీ సేతియా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయాల సమ్మిళితమైన షెర్లీ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ కామెడీతో పాటు హీరోగా తల్లిగా నటించిన రాధిక సైతం తన నటనతో ఆకట్టుకుంది. థియేటర్ లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొంది.అంతేకాకుండా గత వారం రోజులుగా ఈ సినిమా జాతీయ స్థాయిలో నెట్ ఫ్లిక్స్ లో టాప్ టెన్ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అతని తల్లి ఉషా ముల్పూరి నిర్మించారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ దీనికి సంగీతాన్ని అందించాడు. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వీక్షించడమే ఈ స్పందనకు కారణంగా తెలుస్తోంది.