Aditya Om: గ్రామీణ ప్రాంతాల్లో ఆదిత్య ఓం అంబులెన్స్ సేవలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Om:పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఆదిత్య ఓం. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి మంచి చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని, దాదాపు 500 మందికి సహాయం చేశారు. అలానే తాండూరు సిటీ ఫీవర్ హాస్పిటల్ లోనూ సేవాకార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరుపల్లి, కొత్తపల్లి పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు.
అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం, ఆ ప్రాంతంలో పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో స్థానిక రోటరీ క్లబ్ తో పాటు తన స్నేహితుల, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ సేవలను ప్రారంభించారు. ఇవాళ ఈ అంబులెన్స్ కారణంగా కొంతమంది ప్రాణాలైనా కాపాడగలగడం ఆనందం ఉందని ఆదిత్య ఓం చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!