ఒకవైపు వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం రాత్రి 8 గంటలకు రెండు ఘాట్ రోడ్ల మూసివేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి వాహనాలను ఘాట్ రోడ్డు లో అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా మొదటి ఘాట్ రోడ్డు మూసివేస్తోంది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి […]
చైనాకు జీవిత కాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమిం చేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చారిత్రాత్మక తీర్మానం కావడం విశేషం. చైనా కమ్యూనిస్టు పార్టీ ఫ్లీనరీ సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభమ య్యాయి. నాలుగు రోజులు జరిగిన ఈ సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు […]
రాష్ట్రవ్యాప్తంగా ఒక నగర పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గంలో ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. తాజాగా హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల్లో ప్రచారంపై స్థానిక డీఎస్పీ విధించిన ఆంక్షలను తప్పు పట్టింది హైకోర్టు. తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్ని కొట్టిపారేసింది హైకోర్ట్. ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఆంక్షలపై హైకోర్టులో లంచ్ మోషన్ […]
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. […]
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, వివాహితులు, విద్యార్ధినులకు వేధింపులు తప్పడంలేదు. తమ కోరిక తీర్చాలంటూ నానా యాగీ చేస్తున్నారు. అనంతపురంలో ఓ గిరిజన యువతిని వేధిస్తున్నాడో యువకుడు. తన కోరిక తీర్చాలని లేకుంటే… ఆ అమ్మాయితో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కట్టుకున్న భర్తకు లేనిపోని మాటలు చెప్పి అమె భర్తను కాకుండా చేసి నేడు విడాకులు కావాలంటూ భర్త తరపు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. తనకు తన కుటుంబానికి న్యాయం […]
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్న వీస్ తన పరువునష్టం కలిగించేలా ట్వీట్లు చేసినందుకు మహా రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు పరువు నష్టం దావా నోటీసలు పంపారు. డ్రగ్ పెడ్లర్ జయదీప్ రనడేతో అమృతకు సంబంధాలు ఉన్నాయని మాలిక్ గతంలో పేర్కొన్నాడు. 48 గంట ల్లోగా ట్వీట్లను తొలగించి, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పా లని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అమృత గురు వారం నవాబ్ మాలిక్‌ను […]
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం. అన్నవరంలో వెలపిన సత్యదేవుడిని దర్శించుకోవడంతో ఎంతో అనుభూతి పొందుతారు భక్తులు. కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన ప్రసాద్ పథకంలో ఈసారి అన్నవరం దేవస్థానానికి చోటు దక్కింది. సుమారు 50 కోట్ల రూపాయల నిధులు సత్యదేవుని కొండ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే అన్నవరం దేవస్థానం ప్రసాద్ పథకం ద్వారా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టే అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా టూరిజం […]
తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలన్నారు. పచ్చి అబద్ధాలతో కిషన్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. బీబీనగర్ ఎయి మ్స్‌కు స్థలం ఇవ్వడంతోపాటు బిల్డింగ్ కూడా ఇచ్చాం. ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు […]
కొన్నేళ్లుగా ఏవోబీ బార్డర్లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట సాగు చేస్తున్న గిరిజనులు మీడియాతో మాట్లాడారు. మేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. గంజాయి మొక్కలు సాగు నేరమే అయినా ఎన్నో కష్టాలతో మేం ముందుకు వచ్చాం. ప్రభుత్వం ముందే చెబితే మేం గంజాయి వేసే వాళ్లం కాదు కదా అంటున్న గిరిజ నులు. మా ఆర్థిక స్థితిగతుల ప్రకారమే మేం గంజాయి వేస్తున్నామని గిరిజనులు […]
భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం అవుతోంది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఓ మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చేసిన సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. వర్షాల వల్ల రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ విశేషంగా స్పందించారు. ఆ వ్యక్తిని అక్కడినించి తరలించేందుకు సరైన వాహనాలు అందుబాటులో లేవు. వెంటనే స్పందించిన మహిళా పోలీస్ సబ్ […]