ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, వివాహితులు, విద్యార్ధినులకు వేధింపులు తప్పడంలేదు. తమ కోరిక తీర్చాలంటూ నానా యాగీ చేస్తున్నారు. అనంతపురంలో ఓ గిరిజన యువతిని వేధిస్తున్నాడో యువకుడు. తన కోరిక తీర్చాలని లేకుంటే… ఆ అమ్మాయితో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
కట్టుకున్న భర్తకు లేనిపోని మాటలు చెప్పి అమె భర్తను కాకుండా చేసి నేడు విడాకులు కావాలంటూ భర్త తరపు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమవుతోందా గిరిజన యువతి. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ కి సోషల్ మీడియా ద్వారా వేడుకుంటోంది ఆ గిరిజన యువతి. న్యాయం జరుగుకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఆమె గోడు వింటారా?