తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలన్నారు. పచ్చి అబద్ధాలతో కిషన్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. బీబీనగర్ ఎయి మ్స్‌కు స్థలం ఇవ్వడంతోపాటు బిల్డింగ్ కూడా ఇచ్చాం. ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు వచ్చిన హక్కు అన్నారు. రాష్ర్టప్రభుత్వం ఇప్పటికే వడ్లను కొంటుంది. ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందన్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లడటం సరికాదని కిషన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ వడ్లు కొనద్దని లేఖలు రాస్తుంటే రాష్ర్టంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం వడ్లు కొనాలంటున్నారన్నారు. కేంద్రానికి, రాష్ర్ట బీజేపీకి సమన్వయం లేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు.