బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది. […]
ఇటీవల కాటేదాన్ బ్యాటరీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నగదును ఎత్తికెళ్లిన కేసును ఛేదించిన మైలారేదేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను బుధవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా, అభినందించి రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్‌లో ఉన్న ఓ బ్యాటరీ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ మసూద్ పదేండ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు. కాగా యజమాని తెచ్చిన డబ్బులు ఆఫీసు అల్మారాలో పెట్టడం గమనించిన మసూద్ ఈ నెల 1 వ తేదీ రాత్రి బీహార్‌కు […]
అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్టు వద్ద టీడీపీ కార్యకర్తలు నారాలోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా నారాలోకేష్ వారితో కాసేపు మచ్చటించారు. మనం పోరాటం చేయటమే ముఖ్యమని, ప్రజల మనవైపే ఉన్నారని లోకేష్ అన్నారు. చింతపండు మొదలుకొని నూనె, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, త్వరలోనే వైసీపీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజలకు అండగా నిలబడాలన్నారు. ధరలపై పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు మన […]
చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోఎన్‌ఈసీ ఆదేశాలనుసారం అధికారులు నడవాలి కానీ, డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ఈసీ ఎన్నికల నిబంధనలు ఏమైనా మార్చారా అంటూ ఆయన మండిపడ్డారు. […]
మరోసారి దేశవ్యాప్తంగా సిద్ధిపేట పేరు మార్మోగిపోయింది. ప్రసిద్ధి పేటగా… తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప జేసింది. సిద్ధిపేట శుద్ధిపేట అని మరోసారి చాటి చెప్పింంది. స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయి లో ఎంపిక అయిన సిద్ధిపేట పట్టణం. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల […]
పోడు భూముల పై నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్టు కాంగ్రెస్ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ట్రైబల్ పేరుతో టీ.ఆర్.ఎస్ నేతలు బినామీలతో వందల ఎకరాలను కబ్జా చేయాలని చూస్తు న్నారని ఆయన ఆరోపించారు. కలిసొచ్చే పార్టీలతో వాచ్ డాగ్ మాదిరిగా లోకల్‌గా నిఘా పెడతామని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక కమిటీ వేశామని, దామోదర రాజనర్సింహా, చిన్నారెడ్డి, బలరాంనాయక్ […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ను ఏక వచనం తో పిలుస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రభుత్వ జీవోను కూడా నారా లోకేష్ పలకరాదన్నారు. జీవోను నారా లోకేష్ నోరు తిరకగ జీయో అని అంటాడని ఎద్దేవా చేశాడు. నారా లోకేష్ కు నోరు తిరగక పోతే ఇంట్లో కూర్చోవాలని అన్నాడు. అంతే కాకుండా నారా లోకేష్ తెలుగు రాకపోతే సరిగ్గా […]
యమునా నది విషపు నురుగుతో పోరాడుతుంది. యమునా నదిలో నడుము లోతు వరకు విషపూరితమైన నురుగుతో నిలబడిన భక్తుల షాకింగ్ చిత్రాలు, వీడియోలు ప్రతి సంవత్సరం ముఖ్యాంశాలుగా మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. సోమవారం, కలుషితమైన నదిలో మహిళలు కార్వా చౌత్ సంద ర్భంగా స్నానం చేస్తున్న అనేక క్లిప్‌లు ఇంటర్నెట్లో హల్ చల్ చేశా యి. అయితే, ఈ ఏడాది విషపూరిత నురుగు సమస్యకు ఢిల్లీ జల్ బోర్డు […]
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను […]
సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. థియేటర్ల రేట్లు, ఆన్లైన్ విధానంపై మంత్రి వారితో చర్చించనున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై థియేటర్ యజమానుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి సమావేశమై థియేటర్ల ఓపెన్, ప్రస్తుత విధానం నుంచి ఆన్ లైన్ విధానానికి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే […]