చైనాకు జీవిత కాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమిం చేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చారిత్రాత్మక తీర్మానం కావడం విశేషం. చైనా కమ్యూనిస్టు పార్టీ ఫ్లీనరీ సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభమ య్యాయి. నాలుగు రోజులు జరిగిన ఈ సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా ఈ తీర్మానానికి ఆమో దం తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శుక్ర వారం వెల్లడించనున్నారు. మాములుగా అయితే చైనా కమ్యూని స్టు పార్టీలోని పొలిట్ బ్యూరోలో రిటైర్మంట్ వయస్సు 68ఏళ్లు. ప్రస్తుతం జిన్‌పింగ్ ఆ వయస్సుకు చేరుకున్నారు. వచ్చే ఏడాదితో ఆయన పదవికాలం రెండు పర్యాయాలు ముగుస్తుంది.
ఉన్నత నాయకులెవరూ రెండు సార్లకు పదవిలో మించి ఉండకూ డదని, 68 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందేనని మావో జెడాంగ్ తర్వాత అధికారంలోకి వచ్చిన డెండ్ జియవోపింగ్ నిర్దేశిం చారు. ఈ నిబంధనను మారుస్తూ జిన్‌పింగ్ సర్కార్ మూడేళ్ల కిందట రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణతో ఇప్పుడు పొలిట్ బ్యూరోలో ఆమోదం లభించడంతో జిన్‌పింగ్‌కు మూడోసారి అధికారం చేపట్టేం దుకు వీలు కలిగింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తన వందేళ్ల చరిత్ర లో చేసిన మూడో చారిత్రాత్మక తీర్మానం ఇది. 1945లో మావో అధి కారాలను బలోపేతం చేసేందుకు, 1981లో డెంగ్ జియావోపింగ్ సమ యంలో ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచేందుకు సీపీసీ ఈ తీర్మానాలను ఆమోదించింది. తాజా తీర్మానంతో మావో, డెంగ్‌లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా షీ జిన్‌పింగ్‌కు అవ కాశం లభించినట్లయింది.