మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్న వీస్ తన పరువునష్టం కలిగించేలా ట్వీట్లు చేసినందుకు మహా రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు పరువు నష్టం దావా నోటీసలు పంపారు. డ్రగ్ పెడ్లర్ జయదీప్ రనడేతో అమృతకు సంబంధాలు ఉన్నాయని మాలిక్ గతంలో పేర్కొన్నాడు. 48 గంట ల్లోగా ట్వీట్లను తొలగించి, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పా లని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అమృత గురు వారం నవాబ్ మాలిక్‌ను హెచ్చరించారు. అమృత మాట్లాడుతూ బాధ్యతయుతమైన పదవిలో ఉన్నవారు ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని అసహానం వ్యక్తం చేస్తున్నారు.
నిజంగానే జయదీప్ రనడేతో నాకు సంబంధాలు ఉంటే నవాబ్ మాలిక్ ఆధారాలతో సహా బయటపెట్టాలని లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని అమృత డిమాండ్ చేశారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కేసుతో డ్రగ్స్ కేసుతో ముంబై పోలీసులకు నిద్ర పట్టడం లేదు. ఈ కేసును ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది.