గంజాయి సాగుతో బలవుతున్న గిరిజనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నేళ్లుగా ఏవోబీ బార్డర్‌లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట సాగు చేస్తున్న గిరిజనులు మీడియాతో మాట్లాడారు. మేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. గంజాయి మొక్కలు సాగు నేరమే అయినా ఎన్నో కష్టాలతో మేం ముందుకు వచ్చాం. ప్రభుత్వం ముందే చెబితే మేం గంజాయి వేసే వాళ్లం కాదు కదా అంటున్న గిరిజ నులు. మా ఆర్థిక స్థితిగతుల ప్రకారమే మేం గంజాయి వేస్తున్నామని గిరిజనులు తెలిపారు. గంజాయి సాగు అక్రమ రవాణా చేస్తున్న వారిలో చాలామంది గిరిజనులే ఉన్నారు. మే,ఏప్రిల్‌లో నెలలో ప్రభుత్వం వారు వచ్చి మాకు అవగాహన కల్పించాలన్నారు. తప్పని తెలిసినా మేం గంజాయి సాగు చేస్తున్నాం. మాజీవన ప్రమాణాలు పెంచుకో వడానికి వేరే మార్గాలు కనిపించడం లేదు. అందు వల్లనే మేం గంజాయి సాగు చేస్తున్నామని, గిరిజనులు అంటున్నారు.
గిరిజనుల మాటలు అలా ఉంటే మరో వైపు ప్రభుత్వం ఆపరేష్ పరివర్తన్ పేరిట ప్రభుత్వం గంజాయి తోటలను ధ్వంసం చేస్తుంది. మరోవైపు నక్సలైట్లు ఆపరేషన్ పరివర్తన్ తిప్పికొట్టాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించ కుండా పంటలను ధ్వంసం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తూ వేసిన వాల్ పోస్టర్‌లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. గంజాయి సాగుతో ప్రతి ఏటా మార్కెట్‌లోకి గంజాయి విపరీతంగా వస్తోంది. ఇప్పటికే ఈ సారి ఆపరేషన్ పరివర్తన్ పేరిట మొత్తం కాకపోయినా పంటలను ధ్వం సం చేయడం ద్వారా, ఎంతో కొంత గంజాయిని మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం చూస్తోంది. ఇదిలా ఉంటే, గిరిజ నులు ఈ గంజాయి సాగుతో అనేక చిక్కుల్లో పడుతున్నారు. దీన్ని పండించడం ఒక ఎత్తయితే మార్కెట్లోకి తీసుకురావడం, అక్రమ రవాణాచేస్తూ పోలీ సుల కంట పడుతూ కేసుల పాలవుతూ బలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి సాగుపై గిరిజనులకు అవగాహన కల్పించి గంజాయి సాగు చేయకుండా చూడాల్సిన బాధ్యతతోపాటు వారికి ప్రత్యామ్నాయం కల్పించాల్సిన అవసరం ఉంది.
Also Read
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!