Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి బతకడమే కాదు బలంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Read Also: CM Revanth Reddy: యాదాద్రి థర్మల్ స్టేషన్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పొరపాటో, కుట్రనో తెలియదు కానీ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. పిల్లలకు అందించాల్సిన ఆహారంపై అధికారులకు ఆదేశలిస్తున్నామన్నారు. ఒక వేళ అధికారులు తప్పిదాలు చేస్తే ఇంటికి పంపుతామన్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించకుంటే శిక్ష తప్పదన్నారు. విద్యార్థులు భయపడితే నడవదు, ధైర్యంగా వాస్తవాన్ని చెప్పాలని మంత్రి పొన్నం సూచించారు. తెలంగాణలోని గురుకులాలు, పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే కాకుండా విపక్షాల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ యాక్షన్‌లోకి దిగింది.