CM Revanth Reddy: యాదాద్రి థర్మల్ స్టేషన్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం
- యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- యూనిట్-2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల రెండో యూనిట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించారు. పవర్ ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం, మంత్రులు తిలకించారు.
Read Also: Minister Sridhar Babu: గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నల్గొండ జిల్లాలోని దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మొత్తంగా 5 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మొదటి యూనిట్ గతంలో ప్రారంభం కాగా, ఇవాళ రెండో యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 72 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగిన అనంతరం యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఈ ప్లాంట్ నుంచి త్వరలోనే 1600 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం కానుంది.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!