JP Nadda: కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు. బీజేపీ ఒంటరిగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. ఎన్డీఏ కూటమి మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంటుందన్నారు. ఇరు పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలమని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
Read Also: CM Revanth Reddy: జనవరిలో రైతు భరోసా.. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని.. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేవంత్ ప్రభుత్వం మాయలఫకీర్‌లా మోసం చేస్తోందని విమర్శించారు. మూడో సారి వరుసగా ప్రధాని అయిన వ్యక్తి మోడీ అని, జవహర్ లాల్ నెహ్రూ అయినప్పుడు ప్రతిపక్షాలు లేవన్నారు. ప్రభుత్వాలపై సానుకూలతతో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వరసగా అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిస్తుందో వారిని కూడా ముంచుతుందని ఆరోపించారు. ఇతర ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తున్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఇంకా చేయలేదని విమర్శించారు. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.. ఇవ్వలేదన్నారు. హిమాచల్‌లో రూ.1,500 మహిళలకి ఇస్తామని హామీ ఇచ్చారు … ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. అక్కడ ఉచిత కరెంట్ అన్నారు.. అసలు కరెంట్ కూడా ఇవ్వలేక పోతున్నారన్నారు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి ఉందన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ పేదలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్‌లకి 12 వేలు ఇస్తామని అన్నారని.. ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇంద్రజాలం తమాషా చేస్తుందన్నారు. తన మీద తనకే భరోసా లేదు… విద్యా భరోసా కార్డు ఎక్కడ నుంచి ఇస్తారని ప్రశ్నించారు. “నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రుణమాఫీ చేయలేదు. వ్యవసాయ కార్మికులకు డబ్బులు ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వలేదు… ఇది రేవంత్ రెడ్డి రిపోర్ట్ కార్డు. రేవంత్ రెడ్డి డోక చేశారు. ఇది జాదుగిరి చేసే సర్కార్.”అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
Read Also: Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం సీరియస్
నిరుపేద వర్గాలకు కూడా అన్యాయం చేశారని అన్నారు. మహాత్మా జ్యోతిభా పూలే ఆశయాలను నెరవేరుస్తామని అవాస్తవాలు మాట్లాడాలన్నారు. రూ. 2 లక్షలు యాదవ, కురుమ సంఘాలకు వృత్తి అభివృద్ధికి ఇస్తామన్నారని కానీ ఇచ్చారా? ని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీయే కాంగ్రెస్ అన్నారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు వ్యాఖ్యల సిద్ధాంతాన్ని పాటిస్తుందన్నారు. ఎన్నిరోజులైతే అధికారంలో ఉంటామో అప్పులతో నడిపిద్దామని, ఆ తరువాత ప్రభుత్వాన్ని అడిగే వారే ఉండరని, ప్రభుత్వం మనుగడలో ఉంటుందో లేదో ? తెలియదనే విధానంలో ఉంటుందని అన్నారు. అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు. మోదీ నేతృత్వంలో మూడో ఆర్థిక దిశగా వెళుతున్నామన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యతనిచ్చారన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్‌తో అందరికీ న్యాయం చేశారన్నారు.
తెలంగాణకు 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ 1.12 లక్షల గ్రాంట్లు, వరంగల్ కు రూ. 27 కోట్లు, టెక్స్ టైల్, రైల్వేకు 20 రెట్లు బడ్జెట్, వందేభారత్ మూడు వందేభారత్, ఐదు భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్న, హైదరాబాద్ విశాఖపట్నం లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్ లోనూ ఎయిమ్స్ నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారన్నారు. బీజేపీ హామీ ఇవ్వనివి కూడా ఇచ్చి చూపెడుతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక చతికిలపడుతుందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ అవాస్తవాలపై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జేపీ నడ్డా అన్నారు.