కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో భూమి కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి అయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను మంత్రి సురేఖ ఖండించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలనా విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో బావమరిదిపై ఎయిర్ గన్‌తో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బావమరిదికి గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్లతో 8 ఏళ్ల కాలంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. ఏపీ వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరగనుంది. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు.
వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్ షిప్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో నిర్ధారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని నిర్ధారణ అయింది.కోర్టుకు ఇదే సమాచారాన్ని సీబీఐ ఇచ్చింది.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.