Deputy CM Bhatti Vikramarka: ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి అయ్యేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించామని ఆయన వెల్లడించారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే ఈరోజు 800 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. విద్య, వైద్యం, విద్యుత్, సాగు నీరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశామన్నారు. 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. వచ్చే 4 ఏళ్లలో దేశంలో రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
Read Also: HYDRA Commissioner: మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం