రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాశ్చా నగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి రెండు నెలల పసికందును హత్య చేశాడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చల్లపాటి బాలాజీ అనే వ్యక్తి.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.
ఏపీలో కేఎల్ రావు జయంతిని ఘనంగా సీఎం చంద్రబాబు మొదలుపెట్టారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు. అక్రమ ఇసుక తరలించడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు.
లైంగిక దాడిని ప్రతిఘటించిన ఓ మైనర్ బాలిక ప్రమాదంలో పడింది. అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో ఓ దుర్మార్గుడు 15 ఏళ్ల బాలికపై దాడి చేసి.. ఆ అమ్మాయిని మంచానికి కట్టేసి ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో ప్రైవేట్ భాగాల వద్ద కాలిన గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. పదే పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్ధం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బుల్లో పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు.
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్‌ఎన్‌వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.