Child Kidnap: ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్.. ఏడుగురి సిబ్బందిపై వేటు
- ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు కిడ్నాప్
- నర్చు వేషంలో వచ్చి ఎత్తుకెళ్లిన మహిళ
- ఏడుగురు సిబ్బందిపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnap: కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి అప్పుడే పుట్టిన మగ శిశువు కిడ్నాప్‌కు గురైంది. తల్లి పొత్తిళ్లలో ఉన్న శిశువును నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. కిడ్నాపర్ మహిళ పసిపాపను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఆస్పత్రిలో అమర్చిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పసికందు తల్లిదండ్రులు, ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాప్ చేసిన మహిళ మచిలీపట్నం రామానాయుడుపేట చెరుకు రసం అమ్మే మహిళగా గుర్తించారు. వివరాల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు. పసికందును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also: Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
ఇదిలా ఉండగా.. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్‌ఎన్‌వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రాథమిక విచారణ తర్వాత చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పూర్తి విచారణ చేసిన తర్వాత మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!