తాము చెప్పినట్లుగానే అన్ని పనులూ చేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి స్పందించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై అధ్యయనం చేస్తామని.. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు.
ఏపీలో జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తెచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయం కొన్ని పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. పెళ్లికొడుకు తండ్రి.. పెళ్లి కుమార్తె తల్లి ఇద్దరూ మనసు పడి పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే జంటగా పరారైన ఉదంతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలోని దుండ్వారా ప్రాంతంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర వద్ద వికలాంగుడు అయినా మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
మీరు గ్రామంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకునే వారికీ సహకరించడం కోసం 750 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేస్తోంది.
తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని స్పష్టం చేశారు.
సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది.
హిమాలయ దేశంలో రాజకీయ సుస్థిరతను కల్పించే భయంకరమైన సవాలును ఎదుర్కొంటున్న కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ సోమవారం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్‌లోని అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. సుగంద్ కుమార్‌తో పాటు తల్లి, కుమారుడు మృతి చెందారు. కడలూరు జిల్లా కరమణి కుప్పంలోని ఓ ఇంట్లో 10 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురి మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశామని పోలీసులు వెల్లడించారు.