CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.
Read Also: Minister Rama Naidu: ఆ గొప్ప వ్యక్తి ఆలోచనతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం..
గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటి పైనా దోపిడీ, ధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో ప్రస్తావించారు. రికార్డుల్లో అన్ని దొరకలేదు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయని.. విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో జరిగిన భూ దోపిడీలు ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు.
ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరిగిందన్నారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారని.. అనర్హులైన వారికి భూ కేటాయింపు జరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలివ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమి కొట్టేశారన్నారు.
శ్వేతపత్రంలో.. “మాజీ ఎంపీ ఏంవీవీకి చెందిన కంపెనీలకు కోట్ల రూపాయలు భూములు ఇచ్చేసారు. ఒంగోలులో రూ. 101 కోట్ల రూపాయల ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేసారు. తిరుపతిలో మఠం భూములను 22 ఏలో పెట్టీ వైసీపీ వాళ్లు కొట్టేశారు విలువైన 70 ఎకరాల వరకూ భూమిని 22 ఏలో పెట్టి దోచేశారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా వైసీపీ నాయకులు కొట్టేశారు. పుంగనూరులో ఓ బడా నేత అధీనంలో రైత్వారీ పట్టాల ద్వారా కొట్టేశారు. ఇళ్ల పట్టాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారు. ఆవ భూములు, అటవీ భూములు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చి నివాస యోగ్యం కానీ చోట్ల ఇచ్చారు.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
“నేరాల్ని నేరంగా పరిగణిస్తాం, ప్రజలు కూడా చర్చ చేయాలి.. ఈ దోపిడీ అరికాడతాం. టీడీఆర్ బాండ్లల్లోనూ అవినీతి జరిగింది. చౌక బియ్యం వాహనాల ద్వారా పోర్టులకు తరలిపోయింది. రాజకీయంగా కక్ష సాధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం చేసిన అన్ని రకాల దోపిడిలపై విచారణ చేస్తాం. పుంగనూరులో పెద్దిరెడ్డి బంధువుల పేరిట 986 ఎకరాల మేర అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశించాం. రీసర్వే రాళ్ళకు, పట్టాదారు పాసు పుస్తకాలపై బొమ్మలపై ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తాం. రీ సర్వేను ప్రస్తుతానికి నిలుపుదల చేస్తాం. ఇసుక దోపిడీపై ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారించి కోర్టుకు సమర్పిస్తాం. భూ కబ్జాలపై ఫిర్యాదులకు ఓ టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాం. అక్రమాల పై కఠినంగా ఉంటాం నంద్యాలలో బాలిక పై అత్యాచారం, చేసి హత్య చేసిన ఘటన, విజయనగరంలో ఆర్నెల్ల పసికందుపై అత్యాచార సభ్య సమాజం తల దించుకొనేలా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరిత గతిని విచారణ. బాధిత కుటుంబాలను ఆదుకునేలా చర్యలు. ఇక పై నా సహనానికి పరీక్ష ఇస్తే వారికి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తా.” అని చంద్రబాబు అన్నారు