Rajasthan Horror: లైంగిక దాడిని ప్రతిఘటించిన ఓ మైనర్ బాలిక ప్రమాదంలో పడింది. అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో ఓ దుర్మార్గుడు 15 ఏళ్ల బాలికపై దాడి చేసి.. ఆ అమ్మాయిని మంచానికి కట్టేసి ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో ప్రైవేట్ భాగాల వద్ద కాలిన గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. జూన్ 14న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో 15 ఏళ్ల మైనర్ బాలికను ఆమె తల్లి ప్రియుడు లైంగికంగా వేధించడానికి ప్రయత్నించగా, బాలిక వద్దని అడ్డుకోవడంతో ఆమెను కొట్టారు. ఆమె ప్రైవేట్ భాగాలపై నూనె పోశారు. బాలికకు చికిత్స అందించకుండా రెండు రోజులుగా గదిలో బంధించి, ఆమె ప్రైవేట్ పార్టులు దుర్వాసన రావడంతో బాలిక తల్లి ఆడుకుంటూ వేడి నూనెలో పడిపోయిందనే నెపంతో ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ బాలికను వైద్య చికిత్స కోసం తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. జులై 12న పోలీసులు పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ బాలికను మంచానికి కట్టేసి దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుడు బాలిక ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశారని, దీంతో కాలిన గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. అయితే, ఆమె విషయాన్ని దాచడానికి ప్రయత్నించింది. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని తన కుమార్తెకు చెప్పింది.
Read Also: Donald Trump: భారీ ప్లాన్‌లోనే వచ్చిన ట్రంప్ హత్యాయత్నం నిందితుడు.. కారులో పేలుడు పదార్థాలు..
ఈ ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్‌లో మైనర్ బాలిక తన బాధను వివరించడంతో దాడి, అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సీడబ్ల్యూసీ ప్రెసిడెంట్ ముఖేష్ వ్యాస్ ఓ లేఖ రాసి ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. ప్రస్తుతం బాధితురాలు సీడబ్ల్యూసీ సంరక్షణలో ఉంది. మైనర్ బాలిక ముంబై నివాసి అని అదనపు ఎస్పీ మహేంద్ర సింగ్ రాజ్వీ తెలిపారు. 2016లో తన తండ్రి చనిపోవడంతో బాధితురాలు జైసల్మేర్‌లో తల్లితో కలిసి నివసిస్తోందని తెలిపారు.