ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్‌ను ప్రభుత్వం నియమించింది. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మలమడుగు డీఎస్పీగా యశ్వంత్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు నిక్కచ్చిగా జరిపారని యశ్వంత్ పేరు పొందారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాను కమిషన్ ఛైర్మన్‌గా వైదొలిగినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తనకు రాసిన లేఖలో కూడా సమాజం అంగీకరించే భాష వాడలేదని అన్నారు. విచారణ కమిషన్లు వేసేదే.. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను గతంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై వేసిన కమిషన్‌కు కూడా పనిచేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో ప్రారంభించింది. ఉదయం ఏపీ జెన్‌కో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగానే తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో నిమ్మచెట్ల నరికివేతను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు.
ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి రూ. 1600 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వీటిల్లో రూ. 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు.