Home Minister Anitha: ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం..
- ముచ్చుమర్రి.. విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం
- నిందితులకు శిక్ష పడాల్సిందేనన్న హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని హోంమంత్రి వెల్లడించారు.
మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని.. ఈ రెండు అంశాలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారన్నారు. మచ్చుమర్రి ఘటనలో మైనర్లు ఉన్నారని మంత్రి చెప్పారు. ఫోన్లలో అశ్లీల వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తుండటమూ ఈ తరహా ఘటనలకు కారణం అవుతోందన్నారు. క్రిమినల్‌కు పార్టీ, క్యాస్ట్ ఉండదు.. వారికి శిక్ష పడాల్సిందేనని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
Also Read
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
Read Also: Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. నాగబాబుకు పదవి..!?
ముచ్చుమర్రి ఘటన
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పీఎస్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందనే భయంతో హత్య చేసి.. మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేశారు.
విజయనగరంలో దారుణ ఘటన
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నెలల చిన్నారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారిపై తాత వరసైన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారిని తల్లి ఉయ్యాలలో పడుకోబెట్టి స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. కొద్దిసేపటికి నార్లవలస గ్రామానికి చెందిన బి.ఎరుకన్న దొర ఇంట్లోకి ప్రవేశించి చిన్నారి లైంగిక దాడి చేశాడు. చిన్నారి బిగ్గరగా ఏడవడంతో అక్కాచెల్లెళ్లు ఇంట్లోకి వచ్చారు. జరిగిన ఘటనను వారు తల్లికి చెప్పారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?