Crime News: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాశ్చా నగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి రెండు నెలల పసికందును హత్య చేశాడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చల్లపాటి బాలాజీ అనే వ్యక్తి. కానిస్టేబుల్ బాలాజీపై గతం కేసు నమోదు కాగా.. ఆ కేసు నిమిత్తం ఏలూరు కోర్టుకు హాజరయ్యాడు. అక్కడే కానిస్టేబుల్ తన భార్య, మామపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికి వచ్చి మరదలిని, అత్తపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
Read Also: Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్
అదే సమయంలో మరదలి రెండు నెలల పసిబాబును పీకనులిమి చంపేశాడు. ఈ క్రమంలో ఇంట్లో వారు గట్టిగా అరవడంతో గ్రామస్థులు అక్కడికి విచ్చేశారు. పసికందును హత్య చేసిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ బాలాజీకి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. బాబు మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు.