Abhishek Sharma: అభిషేక్ శర్మ ఒక స్లాగర్, గొప్ప ఆటగాడు కాదు.. పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్..
- అభిషేక్ శర్మ టెక్నికల్‌గా గొప్ప ఆటగాడు కాదు..
- అభిషేక్ ఒక ‘‘స్లాగర్’’..
- పాక్ మాజీ క్రికెటర్ ఓవర్ యాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: హై ఓల్టేజ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడనున్నారు. ఇప్పటికే రెండు దేశాల మీడియాల్లో క్రికెట్ అనలిస్టులు మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి అనుచిత వ్యాక్యలు చేశారు. ఒక టీవీ షోలో మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ టెక్నికల్‌గా గొప్ప ఆటగాడు కాదని, అతను ఓ స్లాగర్( టెక్నిక్ కన్నా బంతిని బలంగా బాదే ఆటగాడు)గా అభివర్ణించారు.
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడుతాడా.? అనేది టీమిండియాను కలవరపరుస్తున్న తరుణంలో ఈ అమీర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘అభిషేక్ శర్మ ఒక స్లాగర్. ప్రతీ బంతిని బలంగా కొట్టాలని కోరుకుంటాడు. బంతి కనెక్ట్ అయితే అవుతుంది, లేదంటే విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతను ఒకే మ్యాచ్‌లో స్కోర్ చేస్తాడు. లేదంటే 10,15,20,0 రన్స్ చేస్తాడు. అతను నిలబడి స్లాన్ చేస్తాడు. అతను సాంకేతికంగా మంచి బ్యాటర్ కాదు. అది నా నిజాయితీ అభిప్రాయం’’ అని ఆమీర్ అన్నారు.
ఇదే కాకుండా అభిషేక్‌ను అవుట్ చేయడానికి ప్లాన్ కూడా వివరించాడు. అభిషేక్ రిస్క్ క్రికెట్ ఆడుతాడు. డీప్ కవర్ ఉంచుకుని, అతడి బాడీ పైకి బౌలింగ్ చేస్తాను. స్లో బాల్స్ వేయడం ద్వారా అవుట్ చేయవచ్చు’’ అని పాక్ మాజీ అన్నారు. గతంలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్లు తనను ఎదుర్కోవడానికి స్లో బాల్స్‌పై ఎలా ఆధారపడుతారో చెప్పాడు. అయితే, ఇలాంటి బాల్స్ ఎదుర్కోవడానికి ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు.
Muhammad Amir on Abhishek Sharma:
"Honestly, he's just a slogger. His chances of failure are high. He’s not a technically sound batsman. It’s not difficult to tackle such a batsman if you bowl on the body line. He will also struggle against slow balls." pic.twitter.com/6lsABj8sdl
— Sheri. (@CallMeSheri1_) February 13, 2026
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?